కొవిడ్ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తిరుపతి స్విమ్స్‌లో పూర్తికాని భవనంలో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చెయ్యడమేంటని ఆయన ప్రభుత్వాన్ని ట్విట్టర్లో నిలదీశారు. తిరుపతి స్విమ్స్ పద్మావతి కొవిడ్ కేంద్రంలో ప్రమాదం బాధాకరమన్న లోకేశ్... ఎంతోమంది కరోనా బాధితులకు సేవ చేసిన రాధిక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో పెచ్చులు మీదపడి గర్భిణీ మృతి