మండుటెండను సైతం లెక్కచేయకుండా చిత్తూరు జిల్లా పడమటి మండలాల మందు ప్రియులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఒకపక్క కరోనా భయం ఉన్నా లెక్క చేయకుండా పోలీసులు విధించిన నిబంధనలు పాటిస్తూ గంటల తరబడి క్యూలో నిలబడి మందు తీసుకువెళ్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ప్రతి రోజు మందు ఎక్కడ దొరుకుతుందా అని అన్వేషించి అలసిపోయిన మందుబాబులు ఇలా ఊరట పొందారు.
రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు జరపడంతో వారి పాలిట వరమైంది. చిత్తూరులో నెత్తిన గొడుగు, ముఖానికి మాస్కు ఉంటేనే పోలీసులు క్యూలోకి అనుమతి ఇస్తున్నారు. మద్యం సీసా పై రూ. 10 నుంచి 20 వరకు ధర పెరిగిందని మందుబాబులు చెప్పారు.
ఇవీ చదవండి: