తిరుపతి కపిల తీర్థం ఆలయంలో రాత్రిపూట చిరుత పులులు సంచరిస్తున్నాయి. ఆలయం మూసేసిన తరువాత ప్రాంగణంలో చిరుతల సంచారం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కర్ఫ్యూ నిబంధనలతో ఆలయ దర్శన వేళలను తితిదే అధికారులు కుదించగా...ఉదయం 6 గంటల నుంచి 11వరకే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్న వన్యప్రాణులు... ఆలయమంతా కలియ తిరుగుతున్నాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిరుతల కదలికల దృశ్యాలను... తితిదే విజిలెన్స్ అధికారులు అటవీ శాఖ అధికారులకు అందించారు. అటవీ ప్రాంతం కావడంతో ఆలయంలోకి వన్య ప్రాణులు రాకుండా కంచెలు ఏర్పాటు చేసేందుకు తితిదే అధికారులకు ప్రతిపాదనలు పంపించారు.
ఇదీ చదవండి: