ETV Bharat / state

తిరుపతిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన - primary health centers news

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఐదు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపన చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్మార్ట్ సిటీ సమీక్షలో పాల్గొన్నారు.

primary health center
పీహెచ్​సీలకు శంకుస్థాపన
author img

By

Published : May 21, 2021, 10:18 PM IST

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద... ఐదు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపన చేశారు. నగరంలో ఎక్కడున్నా 15నిమిషాల్లో పీహెచ్​సీలకు చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి రూ.80లక్షలు చొప్పున... ఐదు పీహెచ్​సీలకు రూ.4 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. భూమిపూజ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా పాల్గొన్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్మార్ట్ సిటీ సమీక్షలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని కమిషనర్ గిరీషా వివరించారు. గరుడ వారధి, వినాయకసాగర్, గొల్లవానిగుంట, కొరమేనుగుంట, శ్రీకాళహస్తి రామాపురం సోలార్ ప్లాంట్, తూకివాకం వద్ద జరుగుతున్న ఆరు మెగావాట్ సోలార్ ప్లాంట్ పనులు, పార్కులు, కొత్త మార్కెట్లు, భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు, మురుగునీరు శుద్ధి కేంద్రాలు, మాస్టర్ ప్లాన్ రోడ్లు అన్నీ పురోగతిలో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. 2023-24 నాటికి తిరుపతి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చెందాలని ఎంపీ, ఎమ్మెల్యే... అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగితే.. ప్రజల విలువ తెలిసేది: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.