చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం ఎస్సీ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన మండలాభివృద్ధి అధికారిణి ఉమావాణి నిరసన కారులతో మాట్లాడి... కాలనీలో నూతనంగా తవ్వించిన బోరుబావిలో మోటారు ఏర్పాటు చేసి వెంటనే సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: ఆ సైకిల్‌పై 4 తరాల నాన్‌స్టాప్ సవారీ