తిరుపతిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలంటూ... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం రద్దు చేయడం సరికాదన్నారు. దీని వల్ల 14 కోట్ల మంది కార్మికులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి వలసలను నివారించాలని కోరారు.
ఇదీ చూడండి: 370 అధికరణం రద్దుకు వైకాపా మద్దతు