తిరుమలలో భారీ కొండచిలువ జనవాసాల్లోకి ప్రవేశించింది. పాప వినాశనం రహదారిలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఉన్న దుకాణాల సముదాయంలోకి వచ్చింది. భారీ కొండచిలువను చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి పాములు పట్టే భాస్కర్ నాయుణ్ని పిలిపించారు. అతను వచ్చి పామును చాకచక్యంగా పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తరచూ సర్పాలు జన సంచారంలోకి వస్తున్నాయని... నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి