ETV Bharat / state

రమణీయంగా శ్రీకాళహస్తీశ్వరుడి వసంతోత్సవం - శ్రీకాళహస్తీశ్వరాలయంలో వసంతోత్సవం తాజా వార్తలు

తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు కన్నుల పండువగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. కరోనా కారణంగా ఏకాంతంగా అతి కొద్దిమంది ఆలయ అధికారుల సమక్షంలో ఈ వేడుకలు చేపట్టారు.

kodanda ramudi brahmotsavam
కన్నుల పండువగా స్వామివారి సేవలు
author img

By

Published : Mar 16, 2021, 8:14 PM IST

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనంపై విహరించే శ్రీరామ చంద్రుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. కరోనా కారణంగా ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వ‌హించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉత్సవాలలో తితిదే జీయర్ స్వాములు, అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా వసంతోత్సవం..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి వసంతోత్సవం ఘనంగా జరిపారు. మొదట ఆదిదంపతులు కేడిగం వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని సూర్య పుష్కరిణి వద్ద వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇవీ చూడండి...

త్వరలో శ్రీవారి పాదాలు, శిలాతోరణం ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.