చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు తెప్పోత్సవం సందర్భంగా గణేశుని లడ్డూ వేలం నిర్వహించారు. 21 కేజీల బరువున్న లడ్డూ మహా ప్రసాదాన్ని బహిరంగ వేలం వేయగా చుట్టు పక్కల గ్రామస్థులతో పాటుగా... ఇతర ప్రాంతాల భక్తులూ పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా 3 లక్షల 4వేల రూపాయలకు తితిదే బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన మురంశెట్టి రాములు ఈ లడ్డూను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేయనున్న ట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశు, ఐరాల జడ్పీటీసీ సుచరిత, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Thirumala : కళారూపాలుగా శ్రీవారి పూజా పుష్పాలు..!