చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం టీఎంవీ వారి కండ్రిగ గ్రామం... పచ్చదనం పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి అందాల నడుమ నిర్మించుకున్న పంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం, సురక్షిత తాగునీటి కేంద్రం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల భవనం.. ఏది చూసినా.. ఎక్కడికి వెళ్లినా ఆహ్లాదాన్ని పంచుతాయి.
గ్రామంలో సుమారు 1500 మంది నివసిస్తున్నారు. పచ్చదనం కాపాడుకోవటానికి వారంతా కలిసికట్టుగా శ్రమించి... ఆ ప్రాంగణమంతా మొక్కలు నాటారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా.. నిర్వహణ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇలా.. ఉమ్మడిగా శ్రమించి గ్రామాన్ని అందంగా మార్చుకున్నారు.
సాయంత్రం వేళ పిల్లలు, పెద్దలు.. చెట్ల నడుమ సేద తీరేతుంటారు. రోజంతా పడిన శ్రమను మర్చిపోయి ప్రశాంతంగా ఉంటారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. నూతన ఉత్తేజాన్ని పొందుతారు. గ్రామాన్ని ఇంతగా.. ఆహ్లాదంగా మార్చటంలో ప్రజలంతా కలిసి కృషిచేస్తూ... రాష్ట్రంలోనే ఆదర్శ వంత పంచాయితీగా నిలుపుతున్నారు.
ఇదీ చదవండి