ఎద్దుల దూకుడుకు కళ్లెం వేసే సంప్రదాయ క్రీడ జల్లికట్టు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో సందడి చేసింది. దాదాపు 10 వేల మందికి పైగా ప్రజలు ఈ క్రీడను తిలకించేందుకు హాజరయ్యారు. ఎడ్లను ముస్తాబు చేసిన యజమానులు.. జనాల్లోకి వదిలారు. పరుగులు తీస్తున్న వాటిని నిలువరించేందుకు యువత పోటీ పడ్డారు. పలువురు గాయాలపాలైనా.. పట్టించుకోకుండా.. రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆడారు.
ఇదీ చదవండి: