చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జేఈఈ పరీక్షా కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేశారు. శ్రీనివాస మంగాపురం మార్గంలో కేఎంఎం కళాశాల, చెర్లోపల్లె వద్ద ఉన్న ఐయాన్ డిజిటల్ జోన్ ప్రాంగణంలో పరీక్షలు జరగనున్నాయి. కేఎంఎం కళాశాలలో 65 మంది, అయాన్ డిజిటల్ జోన్ ప్రాంగణంలో 425 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జిల్లాలోని పలు కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు మూడు అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశామని ఐయాన్ డిజిటల్ జోన్ సూపర్వైజర్ బైరెడ్డి తెలిపారు. అలాగే విద్యార్థులకు మాస్కులు,శానిటైజర్లు ఇస్తున్నామని పరీక్షల అనంతరం గదిని శానిటేషన్ చేస్తున్నట్లు తెలిపారు. బాత్ రూమ్ ,టాయిలెట్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు