చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జల్లికట్టు వేడుకలు ప్రారంభయ్యాయి. ఉదయం పశువులను పూజించి వాటి కొమ్ములకు రంగులు అద్దారు. రాజకీయ, సినీ ప్రముఖుల, దేవుళ్ల చిత్రపటాలను వాటి కొమ్ములకు కట్టి రంగంలోకి దించారు. రోడ్డుకు ఇరు వైపులా నిల్చున్న యువకులు వాటిని నిలువరించేందుకు పోటీ పడ్డారు. పోటీలను తిలకించేందుకు రాష్ట్రం నలుముూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలిరావటంతో గ్రామం కిక్కిరిసిపోయింది.
అడ్డుకున్న పోలీసులు
వేడుకలను పోలీసులు అడ్డుకోవటంతో గ్రామస్తులు అసహనానికి గురయ్యారు. సంప్రదాయ పండుగలను అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు.
ఇదీచదవండి: భోగి పరమార్థం.. తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహం