చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్గా జాహ్నవి బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఈమె మదనపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు సబ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ చేరే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు మదనపల్లి డివిజన్ పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి