ఇదీచదవండి.శ్రీవారి భక్తులకు 'వెబ్' శఠగోపం
చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు - దొంగల ముఠా అరెస్టు
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
చిత్తూరు జిల్లా వి.కోటలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లా తెలిపారు. నిందితుల నుంచి 126 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, లక్ష రూపాయల నగదుతో పాటు ఒక లాప్ టాప్, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఇప్పటికే 29 కేసులు నమోదయ్యాయని డిఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు అరీఫుల్లా అన్నారు.
ఇదీచదవండి.శ్రీవారి భక్తులకు 'వెబ్' శఠగోపం
Last Updated : Feb 8, 2020, 10:56 AM IST