ETV Bharat / state

సినీ ఫక్కీలో అంతర్జాతీయ స్మగ్లర్​ అరెస్టు - latest news in sri city

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివశంకర్, అతని ఇద్దరు అనుచరులను శ్రీసిటీ పోలీసులు అరెస్టు చేశారు. రాచకండ్రిగ వద్ద జరిపిన వాహనల తనిఖీల్లో పట్టుబడిని వీరిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న స్మగ్లర్లు
author img

By

Published : Nov 1, 2019, 8:33 AM IST

తిరుపతికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివశంకర్ శ్రీ సిటీ పోలీసులకు చిక్కాడు. తమిళనాడు సరిహద్దుల వద్ద శ్రీ సిటీ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో శివశంకర్, అతని ఇద్దరు అనుచరులు తిరుమల్‌రెడ్డి, సిరాజ్ బాషా తెల్లవారు జామున 4.30 సమయంలో దొరికిపోయారు. శివశంకర్ అతని అనుచరులతో కలిసి స్కార్పియోలో వెళ్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. చెన్నైవైపుగా అనుమానాస్పదంగా వెళ్తున్న స్కార్పియోను పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా డ్రైవర్​ ఆపలేదు. వెంటనే అధికారులు ఆ వాహనాన్ని వెంబడించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే శివశంకర్​పై 64 పెండింగ్ కేసులు ఉన్నాయనీ, అతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : రూయా ఆసుపత్రి వద్ద వ్యక్తి హత్య

Intro:చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలో పోలీసులు తనిఖీలు........ కారు,ఐదు ఎర్రచందనం దుంగలతో పాటుగా అంతర్జాతీయ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.Body:Ap_tpt_37_31_bada_smaglars_arest_av_ap10100

రాచకండ్రిగ వద్ద శ్రీ సిటీ పోలీసుల వాహన తనిఖీలు.అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివ శంకర్, అతని ఇద్దరు అనుచరులు తిరుమల్ రెడ్డి, సిరాజ్ బాషాల అరెస్ట్ చేసిన పోలీసులు.
తిరుపతికి చెందిన స్మగ్లర్ శివ శంకర్ పై ఇప్పటికే 64 కేసులు పెండింగ్. 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న శివ శంకర్.రాచకండ్రిగ వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ ముగ్గురు.
చిత్తూరు జిల్లా నందు జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్గ్లర్ మరియు అతని ఇద్దరు అనుచరుల అరెస్ట్
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్ పి శ్రీ ఎస్ సెంథిల్ కుమార్, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కె. కృష్ణార్జునరావు గారి అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరంతర వాహనాల తనిఖీలు, సమాచార సేకరణ జరుగుచున్నది. ఈ కార్యాచరణలో భాగంగా ఈ దినం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు ఉదయం 4. 30 గం.ల. సమయంలో రాచకండ్రిగ వద్ద శ్రీసిటీ ఇన్స్పెక్టర్ శ్రీ జగదీశ్ నాయక్, ఎస్.ఐ శ్రీ మధు మరియు SBX సిబ్బందితో వాహనాల తనిఖీలు చేస్తుండగా చెన్నై వైపుగా అతివేగంగా వెళ్తు అనుమానాస్పదం గా వున్న స్కార్పియో వాహనాన్ని అపే ప్రయత్నం చేయగా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేయగా స్కార్పియో వెంబండించి అదుపులో తీసుకోని తనిఖీ చేయగా అందులో 5 ఎర్రచందనం దుంగలను కనిపెట్టడం జరిగి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురుని అదుపులో తీసుకొని విచారించడం జరిగినది. ఈ విషయంపై శ్రీ సిటి పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుచున్నది.
ముద్దాయి వివరములు.......... జంగా శివ శంకర్, తిరుపతి.ఇతను ఎర్ర చందనం అక్రమ రవాణాలో జాతీయ స్థాయి స్మగ్గ్లర్.2014 లో ఇతని పై ఫారెస్ట్ డిపార్టుమెంటు వారు PD Act కేసు పెట్టి ఉన్నారు.
2017 లో ఇతని పై పోలీసు డిపార్టుమెంటు వారు PD Act కేసు పెట్టి ఉన్నారు.
ఇతని పై 64 కేసులు ఉన్నవి.
ఎ. తిరుమల రెడ్డి ఎర్రవారిపాలెం మండలం, చిత్తూరు జిల్లాకు చెందినవ్యక్తి.ఇతను ఎర్ర చందనం అక్రమ రవాణాలో లోకల్ స్మగ్గ్లర్ మరియు కూలీలను సమకూర్చేవాడు. సిరాజ్ బాష, నెల్లూరు జిల్లా.ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వాహనాలకు డ్రైవర్ గా పనిచేసేవాడు.ఇతనిపై ఫారెస్ట్ డిపార్టుమెంటు వారిచే 2009 లో ఒక కేసు ఉన్నది.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.