చిత్తూరు జిల్లా చంద్రగిరిలో అమానుష సంఘటన జరిగింది. తిరుపతి జీవకోనకు చెందిన బ్రహ్మయ్య పది రోజుల క్రితం అనారోగ్యంతో మల్లయ్యపల్లెలోని బంధువులు ఇంటికి వచ్చాడు. అయితే కరోనా భయంతో బంధువులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బ్రహ్మయ్య చంద్రగిరి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో తలదాచుకుంటున్నాడు. ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మయ్య మృతి చెందాడు. ఆదివారం కావడంతో బస్టాండ్ పక్కనే సంత జరుగుతోంది. రద్దీ ఉన్న ప్రాంతంలో మృతదేహం ఉన్నా కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. గంటలు కొద్దీ మృతదేహం అక్కడే ఉన్నా కనీసం పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయలేదు. మృతుడుకి కరోనా సోకిందనే భయంతో స్థానికులు అటువైపే రావటం లేదు.
ఇదీ చదవండి: అమరరాజకు విద్యుత్ సరఫరా నిలిపివేత.. ఎందుకంటే?