ETV Bharat / state

Bitter Experience to Deputy CM: ఆయనొస్తున్నారని.. జనం ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు - గడపగడపకు మన ప్రభుత్వం

Bitter Experience To Deputy CM Narayana Swamy: గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటింటి పర్యటన చేపట్టిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. కాగా ఈ ఘటన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారులు, పార్టీ నేతలతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం పేరిట పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని పాచిగుంటలో జరిగింది.

Deputy CM
Deputy CM
author img

By

Published : May 24, 2023, 10:04 PM IST

Bitter Experience To Deputy CM Narayana Swamy: గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటింటి పర్యటన చేపట్టిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని పాచిగుంటలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారులు, పార్టీ నేతలతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం పేరిట పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి చేపట్టిన పర్యటనలో భాగంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వాకబు చేస్తూ మళ్లీ వైకాపాను ఆదరించాలని కోరుతూ ముందుకు సాగారు.

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి తన సొంత నియోజకవర్గంలోనే తరచూ వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం పేరిట పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి కి నిత్యం ఏదో ఒక గ్రామంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా గంగాధర నెల్లూరు మండలం పాచిగుంటలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రికి ఎదురైన అనుభవం.. ఆయనలో అసహనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన 20 కుటుంబాల ప్రజలు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటిస్తున్న నేపథ్యంలో తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. 20 ఇళ్లకు తాళాలు వేయడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్లకుండా వెనుదిరిగారు.

అధికారిక పర్యటనను వ్యతిరేకిస్తూ వెళ్లిపోయిన కుటుంబాల గురించి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర అసహనానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి పొందుతూనే తన పర్యటనను వ్యతిరేకించడం దారుణమని, ఈ విషయంపై అధికారులు, వాలంటీర్లు ఆ కుటుంబాలకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాలకు అర్హతలను పరిశీలించి అనర్హులైన వారికి తొలగించే చర్యలు చేపట్టాలని వాలంటీర్లను ఆదేశించారు.

గడపగడపకు మన ప్రభుత్వంలో డిప్యూటి సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం

నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి పూర్తిగా అర్హత ఉండే వారికి ఇచ్చాము. నా సూచనల ప్రకారం ముందు వారికి నోటీసులు ఇవ్వండి. ప్రజలు ఎందుకు వెళ్లిపోయారని..వారికి ఎంత డబ్బు పడిందని అందరికి తెలియాలి. అర్హత ఉన్న వారికి పథకాలు కొనసాగించి, అర్హత లేని వారికి తొలగించాలి. ప్రజలు ఎందుకు వెళ్లిపోవాలి.. అసలు కారణం ఏంటి..? ప్రభుత్వం తరఫున ప్రయోజనం పొందినపుడు అందరూ కలిసి మాట్లాడుకోవాలి. వృద్ధులకు పింఛన్ పడుతుంది, మూడు అంతస్తుల భవనం ఉన్న వారికి కూడా పింఛన్ పడుతుంది. కానీ ఇలా శతృత్వాన్ని పెంచుకొని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు.- నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.