చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఓబులేష్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల పని ఒత్తిడి కారణంగా ఒక్కసారిగా ఆయనకు రక్తపోటు పెరిగింది. కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రేపటి పోలింగ్‌కు ఓబులేష్ స్థానంలో జిల్లా రెవిన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ను నియమించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు.
ఇదీ చదవండి