మహిళ వ్యక్తిగత చిత్రాలను గ్రామ సచివాలయానికి అంటించిన వ్యక్తి అరెస్ట్ - illegal relation pics pasted on village secretariat
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఓ యువకుడు దుర్మార్గంగా వ్యవహరించాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వ్యక్తిగత చిత్రాలను గ్రామ సచివాలయం కార్యాలయానికి అంటించాడు. మహిళ, గ్రామస్థుల ఫిర్యాదుతో యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడికి పెళ్లై పిల్లలు ఉన్నందున... కొంతకాలంగా మహిళ దూరంగా ఉంటోందని పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా ఉన్న వివాహేతర సంబంధాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆమె వ్యక్తిగత చిత్రాలను నిందితుడు బహిర్గతం చేసినట్లు తెలిపారు.