ETV Bharat / state

కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కులు నూతన విధానానికి తెర లేపారు. సరిహద్దు రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పసుపత్తూరులో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 672 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

illegal karnataka wine seize at pasuvatthooru chitthore district
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత
author img

By

Published : Jul 28, 2020, 12:42 AM IST

చిత్తూరు జిల్లా గంగవరం మండలం పసుపత్తూరులో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసుపత్తూరు వద్ద పలమనేరు ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 672 టెట్రా ప్యాకెట్ల మద్యం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

యువకుడిని కొట్టారని పోలీసులతో కుటుంబసభ్యుల వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.