చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగొంది కాలనీకి చెందిన నాయనప్ప ఉరి వేసుకొని చనిపోవడం స్థానికులకు కన్నీరు తెప్పించింది. నాయనప్ప భార్య లీలమ్మ రెండు నెలల కిందట చనిపోయింది. అప్పట్నుంచి ముభావంగా ఉన్న నాయనప్ప బుధవారం భార్య సమాధి వద్దకు వెళ్లాడు. అక్కడే ఆమె చీరతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: వ్యాపారి హత్య కేసులో ముగ్గురు అరెస్టు