చిత్తూరు జిల్లా ఊసరపెంటలో జరిగిన కుల దురహంకార హత్యను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ - ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. తిరుపతిలోని భవానీనగర్ కూడలిలో నిరసన చేశారు. హేమావతి హత్యను ప్రతి ఒక్కరూ... ఖండిచాలని డివైఎఫ్ఐ నాయకులు, కళాశాల విద్యార్ధులు డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలని నినాదాలు చేశారు.
ఇవీ చదవండి....ఊసరపెంట పరువు హత్య కేసులో నిందితులు అరెస్టు