ETV Bharat / state

నివర్‌ తుపానుతో జిల్లాలో రూ.300 కోట్ల నష్టం

తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలో రూ.300కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా తెలిపారు. వర్షాల కారణంగా 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్‌ ప్రకటించారు.

huge loss in the chittor district due to cyclone affect
నివర్‌ తుపానుతో జిల్లాలో రూ.300 కోట్ల నష్టం
author img

By

Published : Dec 1, 2020, 7:18 PM IST

నివర్‌ తుపానుతో చిత్తూరు జిల్లాలో వాటిల్లిన నష్టాలను వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారని చిత్తూరు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. వర్షాల కారణంగా 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్‌ ప్రకటించారు. పశు సంవర్ధక శాఖకు రూ.15లక్షల నష్టం వాటిల్లిందన్నారు. 1300 గృహాలు పాక్షికంగా, పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. వరద సహాయ శిబిరాలకు వచ్చిన వారికి రూ.500 చొప్పున సహాయం అందచేస్తున్నామని తెలిపారు. వర్షాల కారణంగా జిల్లాలో... రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.110 కోట్ల నష్టం వాటిల్లినట్లు కలెక్టర్‌ తెలిపారు. పంచాయతీరాజ్‌, నీటిపారుదల, విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.

ఇదీ చదవండి:

వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.