ETV Bharat / state

కాలుష్యం కోరల్లో చిక్కుకుని... ఊపిరందక ప్రాణాలు వదిలాయి - ఊపిరందక ప్రాణాలు వదిలిన చేపలు

చిత్తూరు జిల్లా రేణిగుంటలోని... వెంకటాపురం చెరువులో చేపలను పెంచుతున్నారు. వాతావరణంలో మార్పులు, నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుదల, అమ్మోనియా శాతం పెరుగుదలతో ఇవాళ 4 టన్నుల చేపలు మృతి చెందాయి.

huge fish have died in venkatpuram lake in renigunta at chittor district
కాలుష్యం కోరల్లో చిక్కుకుని... ఊపిరందక ప్రాణాలు వదిలాయి
author img

By

Published : Aug 17, 2020, 9:47 PM IST

చిత్తూరు జిల్లా రేణిగుంటలోని 86 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెంకటాపురం చెరువులో మల్లమడుగు కార్పొరేషన్ సభ్యులు రూ.3 లక్షలు ఖర్చుచేసి చేపలు పెంచుతున్నారు. ఇవాళ 4 టన్నుల చేపలు చనిపోయి చెరువులో తేలాయి. సుమారు 14 రోజుల క్రితం కొన్ని చేపలు చనిపోవటంతో ఈ చెరువులోని నీటిని నెల్లూరు జిల్లాలో ల్యాబ్​కు పంపి పరీక్షించారు.

నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయిందని, అమ్మోనియా 0% ఉండాల్సింది... 0.2 శాతానికి పెరిగిందని నిపుణులు గుర్తించారు. కాలుష్యం, వాతావరణంలోని మార్పులు కారణమని వారు తెలిపారు. ప్రస్తుతం మందులు వాడుతున్నా... పెద్ద మొత్తంలో చాలా చేపలు చనిపోవటం చాలా బాధని మిగిల్చిందని కార్పొరేషన్ సభ్యులు తెలిపారు. చెరువుపై వచ్చే ఆదాయం మీద ఆధారపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.