ETV Bharat / state

నిత్య పెళ్లికూతురు అరెస్టు.. అనంతరం బెయిల్​పై విడుదల

వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో తేల్చిన పోలీసులు...భర్తల నుంచే కాక స్థానికుల నుంచి అప్పులు తీసుకుని ఎగవేసినట్లు తెలిపారు. దీనంతటికి మొదటి భర్త సహకారం అందిస్తున్నట్లు మోసపోయిన బాధితులు ఆరోపిస్తున్నారు.

నిత్య పెళ్లికూతురు అరెస్టు
నిత్య పెళ్లికూతురు అరెస్టు
author img

By

Published : Jul 14, 2021, 10:53 PM IST

నెల్లూరు జిల్లాలో మొదటి భర్త. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో భర్త, చిత్తూరు జిల్లాలో మూడో భర్త. ప్రేమంటూ యువతను ముగ్గులోకి దింపి.. ఆపై పెళ్లి చేసుకొని లక్షల రూపాయలు దోచుకొని పరారవుతున్న నిత్య పెళ్లి కూతురు సుహాసిని అనే మహిళ మోసాల భాగోతం. మూడో భర్తైన చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్‌కుమార్‌ ఫిర్యాదుతో తాజాగా దర్యాప్తు చేపట్టిన తిరుపతి పోలీసులు.. ఖిలాడీ లేడీ గుట్టు విప్పారు. తనను తాను అనాథగా పరిచయం చేసుకున్న సుహాసిని ప్రేమిస్తున్నానంటూ సునీల్‌కుమార్‌ వెంటపడింది. ఒప్పించి గతేడాది డిసెంబర్‌లో సునీల్‌కుమార్‌ని వివాహం చేసుకుంది.

నిత్య పెళ్లికూతురు అరెస్టు

నిలదీయడంతో పరారీ...

ఈ క్రమంలోనే సునీల్‌ నుంచి పలు దఫాలుగా నాలుగు లక్షలు తీసుకోవడంతో పాటు అతనికి తెలియకుండా సునీల్‌ తండ్రి వద్ద నుంచి మరో రెండు లక్షలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సునీల్‌ నిలదీయడంతో నగదుతో పాటు అత్తింటి వారిచ్చిన బంగారంతో రాత్రికి రాత్రే సుహాసిని పరారైంది. ఇంట్లో లభించిన ఆమె ఆధార్‌ కార్డు చిరునామాతో ఆరా తీయడంతో అప్పటికే పెళ్లైనట్లు గుర్తించిన సునీల్‌... తిరుపతిలోని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తొలి భర్త సహకారంతో...

సునీల్‌ ఫిర్యాదుతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు అతను మూడో భర్తగా నిర్థారించారు. రెండోపెళ్లి నాటికే ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. పెళ్లిళ్లు చేసుకున్న ప్రాంతాల్లో భర్తలతో పాటు స్థానికుల నుంచీ అప్పులు తీసుకుందని సుహాసిని చేతిలో మోసపోయిన బాధితులు ఆరోపిస్తున్నారు. సుహాసిని స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరని నెల్లూరుకు చెందిన తొలిభర్త వెంకటేశ్వరరాజు సహకారంతోనే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి ఖిలాడీ లేడీని అరెస్ట్‌ చేసిన పోలీసులు... తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.

ఇవీచదవండి.

suhasini arrest: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఐదేళ్ల ప్రాయంలోనే పీఠాధిపతి- ఎక్కడంటే?

ప్చ్.. ఒలింపిక్స్​లో ఈ స్టార్ ప్లేయర్స్​ను చూడలేం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.