ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆది దంపతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతుల మాంగల్య ధారణ సమయంలో.. వందలాది జంటలు ఒక్కటయ్యాయి. కల్యాణానికి ముందు స్వామివారు గజవాహనాన్ని, శ్రీ జ్ఞానప్రసూనాంభీకాదేవి అమ్మవారు సింహవాహనాలను అధిరోహించారు. వారిని ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి అర్టకులు చండికేశ్వర రాయబారం జరిపి, కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవారి సన్నిధిలో వివాహాలు చేసుకున్న జంటలకు దేవస్థానం తరఫున ఉచితంగా తాళిబొట్టు, వస్త్రాలను అందజేశారు. బాల్య వివాహాలు జరగకుండా పోలీసులు, బాలిక సంరక్షణ అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి...