కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి.. వకుళమాత ఆలయాన్ని నిర్మించే అదృష్టాన్ని ఆ శ్రీనివాసుడే నాకు కల్పించాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు బండపై ఆలయ పునర్నిర్మాణ పనులను టీటీడీ ఆధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులను పూజలు చేసి ప్రారంభించారు.
ఆలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని... మరో నెల రోజల్లో పూర్తి కావచ్చని మంత్రి తెలిపారు. వకుళమాత ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా భాసిల్లుతుందని వెల్లడించారు.
ఇదీచూడండి: మూడేళ్ల తరువాత 'మిథాని' పనుల్లో మళ్లీ కదలిక