చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు సమీపంలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఉన్న విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆలయం వెనుక భాగంలో పడి ఉన్న స్వామి, అమ్మవార్ల విగ్రహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెదేపా వర్గీయుల ఆందోళన
విగ్రహాల ధ్వంసం కేసులో తెదేపా వర్గీయులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంటూ కుప్పం పోలీసు స్టేషన్ ఎదుట ఆ పార్టీ నేతలు, స్థానికులు ధర్నాకు దిగారు. విగ్రహాల ధ్వంసం ఘటనతో తెదేపాకు సంబంధం లేకున్నా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితులు ఎవరైనా వదిలి పెట్టం..
విగ్రహాల ధ్వంసం కేసుపై ఎస్పీ సెంథిల్ కుమార్.. కుప్పంలో సమీక్షించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
నిధుల కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల ఎదురుచూపులు.. నత్తనడకన పనులు