తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అర్చకులు పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, అభిషేకం చేపట్టారు. పవిత్ర సమర్పణ, యాగశాలలో తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం, గోపురాలకు, ఉప ఆలయాలకు పవిత్ర సమర్పణ చేశారు. వేడుకలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. శనివారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి :