చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కేఎస్ అఘమొహిద్దిన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవభారత నిర్మాణానికి మహాత్మా గాంధీ ఆదర్శప్రాయులని కొనియాడారు.
జిల్లాలోని పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో... గాంధీ జయంతిని పురస్కరించుకుని కాఫీ పొడి వ్యర్థాలతో 50 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో గాంధీ చిత్రాన్ని వేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరై గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. మహాత్ముడి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని... ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రాష్ట్రంలో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: