ETV Bharat / state

ఐదేళ్ల కుమార్తెకు ఉరివేసి, తండ్రి ఆత్మహత్య... సెల్ఫీ వీడియో వైరల్​ - suicide news in chittoor dst

చిత్తూరులో ఓ తండ్రి తన కుమార్తెకు ఉరివేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రవర్తన సరిగా లేదని తట్టుకోలేక ఈ విధంగా చేసినట్లు సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

కుమార్తెకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

author img

By

Published : Sep 4, 2020, 3:20 PM IST

Updated : Sep 4, 2020, 5:52 PM IST

చిత్తూరు నగరంలో అయిదేళ్ల కుమార్తెకు ఉరివేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరానికి చెందిన కొరియర్ డెలివరీ బాయ్​గా పని చేస్తున్న గణేష్ ఓ ప్రైవేటు హోటల్లో గురువారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత తన అయిదేళ్ల కుమార్తె కార్తీక మెడకు తాడు చుట్టి ఉరివేసి చంపాడు. అనంతరం గణేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గణేష్ భార్య దివ్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించి... విసుగు చెంది కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. రెండో పట్టణ సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గణేష్ ఆత్మ హత్యకు పాల్పడే ముందు తన ఫోన్లో రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తమ ఇద్దరి ఆత్మహత్యకు తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య దివ్య కారణమని గణేష్ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. తన భార్య చెడు తిరుగుళ్లపై గతంలోనే గొడవలు జరిగాయని..పెద్దల పంచాయతీతో సద్దుమణిగినా తన భార్య వ్యవహారంలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు గణేష్.

కుమార్తెకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

తన భార్య వ్యవహారం నచ్చక విడాకులు తీసుకున్నామని ..తన కూతురుని తనవద్దే ఉంచుకొని చిత్రహింసలకు గురిచేసేదని గణేష్​ వీడియోలో వెల్లడించాడు. తన కుమార్తెను ఇవ్వాలని కోర్టుకు వెళ్లినా న్యాయం జరగలేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందాడు. తన అయిదేళ్ల కుమార్తె కార్తికను తన భార్య ప్రియుడు లైంగికంగా వేధిస్తున్నారని తన కూతురు తనతో తెలిపిందని గణేష్ వివరించాడు. తను చనిపోతే తన కుమార్తె అనాథ అవుతుందని తనని కూడా చంపేసినట్లు వెల్లడించాడు. ఈ వీడియోలను గణేష్ తొలుత తన మిత్రులకు పంపించాడు. ఆపై వీడియో వైరల్ అయింది.

ఇదీ చూడండి

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై గొంతు కోసి..

Last Updated : Sep 4, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.