ETV Bharat / state

సాగని విత్తన పంపిణీ.. ఖరారు కాని రాయితీ ధరలు - Farmers want to give intercrop seeds along with groundnut

ఖరీఫ్‌ ముంచుకొస్తోంది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సాగు కోసం భూములు దున్నుకుంటున్నారు. ఏయే విత్తనాలు అవసరముందో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాకు విత్తన కేటాయింపులు జరిగాయి. ఒక్క వేరుసెనగ విత్తనాలు కావాల్సిన రైతులకు.. పది రోజుల కిందటే పేర్లు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మూడో రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. వేరుసెనగ, జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలకు మాత్రమే రాయితీ ధరలు ఖరారు చేశారు. మిగిలిన అంతర పంటలకు ఖరారు చేయలేదు. వేరుసెనగతో పాటు ఇస్తే విత్తనం సిద్ధం చేసుకుని, పొలం పనులు చేసుకొనేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

Seed distribution
విత్తన పంపిణీ
author img

By

Published : May 24, 2021, 12:23 PM IST

అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో వేరుసెనగ పంటతో పాటు ఇతర అంతర పంటలు సాగు చేస్తారు. పప్పుధాన్యాలతో పాటు చిరుధన్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా పంటల విత్తనాలను జిల్లాకు 7,672 క్వింటాళ్లు కేటాయించారు. అందులో పప్పుధాన్యాల్లో ప్రధానంగా కంది 4,500 క్వింటాళ్లు, ఉద్దులు 112 క్వింటాళ్లు, పెసర 1,255 క్వింటాళ్లు కేటాయించారు. అదే చిరుధాన్యాలు కింద రాగి 425 క్వింటాళ్లు, కొర్రలు 500, ఊదలు 13, అరికెలు 15, సామలు 10 క్వింటాళ్లు అండుకొర్రలు 20 క్వింటాళ్లు కేటాయించారు. ఈ విత్తనాల సేకరణ, పంపిణీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. అయితే ఇప్పటికీ విత్తన రాయితీ ధరలు ఖరారు కాలేదు. అయినా కొన్ని రకాల విత్తనాలను ఆ సంస్థ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

50 శాతం రాయితీతో పచ్చిరొట్ట

వరి సాగు చేసుకునే రైతులకు పచ్చిరొట్ట ఎరువులను వ్యవసాయశాఖ పంపిణీ చేయనుంది. జిల్లాలోని 25 మండలాలకు విత్తనం కేటాయించారు. ఆయా రకాల విత్తనాలకు 50 శాతం రాయితీని ప్రకటించారు. అందులో జీలుగ 700 క్వింటాళ్లు, జనుము 100, పిల్లిపెసర 50 క్వింటాళ్లు కేటాయించారు. జీలుగ క్వింటాలు పూర్తిధర రూ.5,800, రాయితీ రూ.2,900, రైతువాటా 2,900, జనుము పూర్తి ధర రూ.7,500, రాయితీ ధర రూ.3,750, రైతు వాటా రూ.3,750, పిల్లిపెసర పూర్తి ధర రూ.8,500 రాయితీ ధర రూ.4,250, రైతువాటా రూ.4,250 సొమ్ము చెల్లించాలి. కావాల్సిన రైతులకు పంపిణీ చేస్తారు.

సాధారణ కంది లేనట్లే!

జిల్లాలో సాధారణంగా వేరుసెనగతో పాటు కంది విత్తనాలను రాయితీతో పంపిణీ చేసేవారు. ఈసారి జనరల్‌ సీడ్‌ కింద కంది విత్తనాల పంపిణీ ఉండదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత మిషన్‌ పథకం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద కంది విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద కొన్నేళ్లుగా కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. కంది విత్తనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వేరుసెనగలో అంతర పంటగా కంది సాగుపై రైతులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

విత్తన సమస్య లేదు

జిల్లాలో వేరుసెనగ, ఇతర అంతర పంటల విత్తనాల సేకరణ, పంపిణీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఇప్పటికే వేరుసెనగ పంపిణీ మూడు రోజులుగా సాగుతోంది. వేరుసెన, పచ్చిరొట్ట ఎరువులకు మాత్రమే రాయితీ ప్రకటించారు. పప్పు, చిరుధాన్యాల విత్తనాలకు ఇంకా రాయితీ ధరలు ఖరారుకాలేదు. అయినా కొంత విత్తనం సిద్ధంగా ఉంచాం. అంతర పంటల విత్తనాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమైతే రైతుల డిమాండును బట్టి విత్తనం తెప్పిస్తాం. విత్తన సమస్య లేదు. తమకు కేటాయించిన విత్తనమంతా రైతులకు పంచేందుకు సిద్ధంగా ఉన్నాం. - ధనలక్ష్మి, జిల్లా మేనేజర్‌ (ఏపీసీడ్స్‌)

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.