ETV Bharat / state

అప్పుల బాధతో పొలంలోనే అన్నదాత ఆత్మహత్య - data of farmers dieds in chittoor dst 2019-2020

ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా.. వారికి అవి అండగా నిలువలేకపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఓ అన్నదాత అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

farmer suicide in chittoor dst peleru due to financial problems
farmer suicide in chittoor dst peleru due to financial problems
author img

By

Published : Jan 23, 2020, 10:10 AM IST

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పీలేరు మండలం దేవలంవారి పల్లిలో రెడ్డప్పరాజు (50) అనే రైతు అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికొచ్చిన పంట చీడపురుగుల పాలై నాశనంమైందనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ముగ్గురు కుమార్తెల వివాహం కోసం రూ.6 లక్షల వరకూ ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి:

అమరావతి కోసం.. పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ..!

Intro:పీలేరులో అప్పుల బాధ తాళలేక రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య...

చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పీలేరు మండలం ఎర్రగుంట పల్లి పంచాయతీ దేవలంవారి పల్లి కి చెందిన రైతు రెడ్డప్పరాజు (50) కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చివరి కుమార్తె చదువుతుండగా.. మొదటి ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించాడు. వీరి వివాహం నిమిత్తం రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు. ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ పొలంలో బోరుబావి కింద టమోటా, వరి, మిరప సాగు చేశాడు. ఈ పంటలకు చీడపీడలు ఆశించి పంట దిగుబడి రాలేదు. తరచూ సాగు చేసిన పంటలు చేతికందకపోవడం... చేసిన అప్పులు తీరక పోవడంతో కుటుంబ సభ్యులకు చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరి వేసుకున్న రైతును గమనించిన స్థానికులు వెంటనే కిందకు దించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతు ఆత్మహత్యకు గల వివరాలను తెలుసుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

నోట్.. సర్
విజువల్స్ ఈటీవీ ఏపీ వాట్సప్లో పంపాను తీసుకోగలరు

Body:పీలేరు

Conclusion:పీలేరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.