చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చెరివి గ్రామంలో ఔషధ నియంత్రణ అధికారులు.. నకిలీ ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో వైద్యుడిగా చలామణి అవుతున్న సిద్దయ్య నుంచి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న మందులు, సూదులు, టీకాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: అధికారుల కళ్లుగప్పి రెండు ఉద్యోగాలు..