రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిర్బంధానికి నిరసనగా.. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆందోళన నిర్వహించారు. గృహనిర్బంధంలో ఉన్న అమర్‌నాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపేందుకు తెలుగుదేశం శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అమర్‌నాథ్ రెడ్డి గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కార్యకర్తల సాయంతో బయటకు వచ్చిన మాజీ మంత్రి.. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: