పంచాయతీ ఎన్నికలంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యయసాయ చట్టాలపై వైకాపా వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ చట్టాలకు మద్దుతు ఇచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై 24 గంటల్లో నిర్ణయాన్ని తెలియజేయాలన్నారు. భాజపా, వైకాపా, తెదేపా త్రీ వన్ పార్టీలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై భాజపా వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ అని, 2024లో అధికారం చేపట్టడం తథ్యమని చెప్పారు.
ఇదీ చదవండి: