చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన.. శ్రీకాళహస్తిలో ఎక్కువగా 43 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓపీ సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా మినహా మిగిలిన కేసులకు అవసరమైతే రుయా తరఫున ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనాపై ఆందోళన వద్దంటున్న కలెక్టర్ భరత్‌గుప్తాతో మా ప్రతినిధి ముఖాముఖి..!
ఇదీ చూడండి: