DEPUTY PRIEST SUSPEND : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు విభూది పట్టిపై చెలరేగిన వివాదంపైన ఆలయ ఉపప్రధాన అర్చకుడు ధర్మేష్ గురుకుల్ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే విచారణ కమిటీ రాక మునుపే.. అర్చకుడు సస్పెన్షన్ వేటుకు గురి కావడంతో కాణిపాకం ఆలయంలో ప్రకంపనాలు చెలరేగాయి. బంగారు విభూది పట్టిలో అధికారులు ప్రమేయం ఉన్నా కూడా ఒక అర్చకుడుపైన చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరో వైపు ఔట్సోర్సింగ్గా పని చేస్తున్న కరుణాకర్.. తిరుమలలో అక్రమ టికెట్ల విక్రయ కేసులో ముద్దాయి కావడంతో విధుల నుంచి తొలగిస్తూ ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చదవండి: