ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లో పాల్గొన్న పదకొండు మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సంతపేటలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందటంతో దాడులు చేశామని పోలీసులు తెలిపారు. పీఎన్సీ నగరపాలక పాఠశాల మైదానంలో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి..చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: తితిదే పాఠశాలలను సందర్శించిన జేఈవో