చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో తెల్లవారుజామున విద్యుదాఘాతంతో గున్న ఏనుగు మృతి చెందింది. మన్నార్ నాయినిపల్లె గ్రామానికి చెందిన విశ్రాంత సైనిక ఉద్యోగి ఉదయ్ కుమార్.. తన పొలంలోకి అటవీ జంతువులు రాకుండా రక్షణగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తగిలి మరణించింది.
సోమవారం రాత్రి పొలాల వైపునకు వచ్చిన ఏనుగు.. తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఘటన జరిగింది. అటవీశాఖ తవ్వించిన కందకాన్ని దాటి.. అటవీ భూమిలోనే విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన రైతు ఉదయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: