గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో మూలూరు చెరువు పరిసరాల్లో ఏనుగులు స్వైర విహారం చేశాయి. రెండు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో హల్ చల్ చేసిన ఏనుగులు పక్కనే ఉన్న శ్రీరంగరాజపురం మండలానికి చేరటం రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
ఏనుగులు చెరకు, వరి పంటలను ధ్వంసం చేసి అక్కడే తిరుగుతుండటం కొందరు రైతులు పెద్దగా కేకలు వేస్తూ వాటిని బెదర కొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. వ్యవసాయ పొలాల వద్ద నివాసాలు ఏర్పరుచుకున్న పలువురు రైతులు ఏనుగుల దాడులకు హడలిపోయి గ్రామాల వైపు వెళ్లిపోయారు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి...