చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై.. పనుల్లేక పస్తులుంటున్నవారికి అండగా నిలిచారు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పులు, కూరగాయలు, కుటుంబానికి 10 కోడిగుడ్ల చొప్పున అందజేశారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు తనవంతుగా సాయం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చదవండి.. స్వస్థలాల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకొస్తున్న ఫార్మా కంపెనీలు