'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగాయి. క్రీడాకారులు వారివారి జట్లను గెలిపించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు. ఇవాళ జరిగిన పోటీల్లో సీకాం కాలేజీ తిరుపతి, ఈఎస్వీయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ తిరుపతి, ఎమరాల్డ్ కాలేజీ తిరుపతి, పీవీసీ జూనియర్ కాలేజీ తిరుపతి, శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజి రంగంపేట, ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజి తిరుపతి, మిట్స్ కాలేజీ మదనపల్లి, ఎమరాల్డ్ డిగ్రీ కాలేజీ రామాపురం జట్లు విజేతలుగా నిలిచాయి.
ఇదీ చదవండి