చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో దళితుడిపై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలపై.. పుత్తూరు డీఎస్పీ మురళీధర్ స్పందించారు. యనమల మంద గ్రామంలో బాల్య వివాహం చేయబోతున్నట్లు ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
విచారణ కోసం పోలీసులకు గ్రామానికి వెళ్లారన్న డీఎస్పీ.. గ్రామంలో వరుడు, వధువుకి బంధువైన బాబు అనే వ్యక్తిని ఎస్ఐ లోకేశ్రెడ్డి విచారించారన్నారు. దీంతో పోలీసులు కొట్టారంటూ.. గ్రామానికి చెందిన ఇరువర్గాల ప్రజలు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ను ముట్టడించారని డీఎస్పీ వివరించారు. స్టేషన్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి దస్త్రాలను గ్రామస్తులు చెల్లాచెదురు చేశారన్నారు. ఎస్సై నిజంగానే దాడి చేశారో.. లేదో.. విచారణ చేస్తున్నామని వివరించారు. గ్రామంలో బాల్య వివాహం జరిగిన ఘటనపైన కూడా విచారణ చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి: పారిస్లో 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్