తిరుమల శ్రీవారికి కోటి రూపాయల విలువైన గో వ్యవసాయ ఆధారిత పంట ఉత్పత్తులు విరాళంగా అందాయి. హైదరాబాద్లోని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను తితిదే మాజీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు పంపగా.. యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ఈ వస్తువులను తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆలయ అధికారులకు అందజేశారు.
వీటిలో 6,200 కిలోల బియ్యం, 1500 కిలోల దేశీ ఆవునెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదాం, 315 కిలోల జీడిపప్పు, 21 కిలోల కిస్మిస్, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల పసుపు, 25కిలోల ఇంగువ, 380 కిలోల పెసరపప్పు, 200 కిలోల శనగ పప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింతపండు, 50 కిలోల రాక్ సాల్ట్, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంతో పండించిన దేశీ రకాల బియ్యంతో స్వామివారి నైవేద్యం సమర్పిస్తుండగా.. ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకులనూ సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి చేసినవే వినియోగించేందుకు వీలుగా ఈ వస్తువులను పంపారు.
ఇదీ చదవండి: