రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు స్వీయం నియంత్రణ పాటించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోరారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయన మాట్లాడారు. లాక్డౌన్లో అందరూ భాగస్వాములు అవుతూ...రాష్ట్రాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కాచిచల్లార్చిన నీళ్లలో పసుపువేసి తాగాలని సూచించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడతున్నాడని ఎద్దేవా చేశారు. అందరూ చేతులు కడుక్కుంటూ, శుభ్రతను పాటిస్తూ రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని... ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.
'మన చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్' - కరోనా వార్తలు
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. తెదేపా అమరావతి గురించి మాట్లాడతోందని ఎద్దేవా చేశారు. అందరూ చేతులు కడుక్కుంటూ, శుభ్రతను పాటించాలని కోరారు.