ETV Bharat / state

Cheated in the name of lottery in chittoor: రూ. 2 కోట్లు గెలిచారని ఫోన్ వచ్చింది.. ఈమె ఏం చేసిందో తెలుసా? - లాటరీ పేరుతో మోసం వ్యక్తి అరెస్టు

లాటరీ పేరుతో చిత్తూరు జిల్లాకు చెందిన యువతిని (cheated a woman in the name lottery in chittoor) మోసం చేసిన విదేశీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్​లైన్​లో రూ. 2.5 కోట్లు లాటరీ గెలుచుకున్నారంటూ.. యువతి నుంచి భారీగా డబ్బు కాజేసిన ఉంగాండాకు చెందిన వ్యక్తిని దిల్లీలో అరెస్టు చేశారు.

Cheated in the name of lottery in chittoor
లాటరీ పేరుతో ఘరానా మోసం
author img

By

Published : Nov 27, 2021, 9:39 PM IST

ఆన్​లైన్ లాటరీ పేరుతో చిత్తూరు జిల్లా నంబాకం గ్రామానికి చెందిన యువతిని (cheated a woman in the name lottery) మోసగించిన కేసులో ఉంగాండకు చెందిన నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.

లాటరీలో 2.5 కోట్లు వచ్చాయని..
ఆన్‌లైన్‌ లాటరీలో రూ.2.5 కోట్లు వచ్చాయని నంబాకం ప్రాంతానికి చెందిన యువతికి గత ఏడాది అక్టోబరులో నిందితుడు ఫోన్ చేశాడు. లాటరీ డబ్బు పొందాలంటే ముందుగా కొంత సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మన యువతి ఇల్లు, పొలం కుదవపెట్టి దశల వారీగా రూ.13,78,890 నిందితుడి ఖాతాలో జమచేసింది. రోజులు గడుస్తున్నా లాటరీ సొమ్ము రాకపోగా..అటునుంచి స్పందన కురవైంది. మోసపోయానని గ్రహించిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ప్రత్యేక బృందం ఏర్పాటు..
జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. నగిరి ఇన్​స్పెక్టర్ మద్దయ్యచారి ఆద్వర్యంలో దిల్లీ వెళ్లిన బృందం అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు సమయంలో హైడ్రామా..
నిందితుడిని అదుపులోకి తీసుకనే సమయంలో హైడ్రామా నడిచింది. పోలీసులను గమనించిన నిందితుడు ఇంట్లోకి వెళ్లి గేటుకు తాళం వేసుకున్నాడు. పోలీసులు హెచ్చరించినా గేటు తెరవకపోవటంతో గ్యాస్ కట్టర్ సాయంతో గేటును తొలగించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్​పై విచారణకో కోసం నిందితుడిని దిల్లీ నుంచి చిత్తూరుకు తీసుకువచ్చారు.

ఇదీ చదవండి

MOTHER MURDERED BABY IN VISAKHAPATNAM: కన్నతల్లి కర్కశత్వం.. నీటి డ్రమ్ములో పడేసి దారుణంగా చంపేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.