ETV Bharat / state

భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువు కట్టలు..భయాందోళనలో ప్రజలు

బలహీనపడిన చెరువుకట్టలు.. కోతకు గురైన మొరవలు లోతట్టు గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదధాటికి దెబ్బతిన్న సాగునీటి చెరువులను ఎనిమిది నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయలేదు. అటు ఆయకట్టు రైతులు ఇటు దిగువ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 313 చెరువుల కట్టలు తెగిపోగా..118 చోట్ల గండ్లు పడ్డాయి. నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు...ఇబ్బందులు పడుతున్న ప్రజలు

author img

By

Published : Aug 11, 2021, 7:13 PM IST

భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు...ఇబ్బందులు పడుతున్న ప్రజలు

వర్షాలు కురవాలి.. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు నిండి తమ పొలాలకు సాగునీరు అందాలని రైతులు, చెరువు సమీప ప్రాంత గ్రామాల ప్రజలు కోరుకోవడం సాధారణం. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలతో చెరువుల కట్టలు బలహీనపడటం, కోతకు గురవడంతో వరదనీరు వస్తే తెగి తమ గ్రామాలు, పొలాలు ముంపునకు గురవతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

ఎనిమిది నెలల క్రితం వచ్చిన నివర్‌ తుపాన్ చిత్తూరు జిల్లాను అతలాకుతలం చేసింది. భారీగా కురిసిన వర్షాలతో చెరువులు దెబ్బతినడంతో కింద ఉన్న పంటపొలాలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ చెరువులు మరమ్మతులు చేయకపోవడంతో మరోసారి భారీ వర్షాలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,063 చెరువుల్లో 802 దెబ్బతిన్నాయి. 313 చెరువులకు కట్టలు తెగిపోగా 118 చోట్ల గండ్లుపడ్డాయి. నివర్‌ తుపానుకు 295 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక పనులకు 55 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. నెలలు గడుస్తున్నా ప్రతిపాదనల దశ దాటకపోవడంతో మళ్లీ వర్షాలు పడితే కట్టలు తెగి వరదనీరు గ్రామాలను ముంచెత్తుతుందన్న భయం దిగువ గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాళహస్తి, పుంగనూరు నియోజకవర్గాల్లో ఎక్కువ చెరువులు కోతకు గురవగా...మదనపల్లె, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో కొంత మేర చెరువులు దెబ్బతిన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లె మండలాల్లో 132 చెరువులు కట్టలు తెగిపోయాయి. సదుం మండలంలోని చెన్నపట్నం చెరువు, వల్లిగట్ల సోమప్ప చెరువులు కట్టల బలహీనపడ్డాయి. వర్షాలు పడి తెగిన చెరువుల మరమ్మతులకు 55 కోట్ల రూపాయలతో మరమ్మతులకు చర్యలు చేపట్టాం. -విజయకుమార్‌రెడ్డి, జలవనరులశాఖ ఎస్‌ఈ

నివర్‌ తుపానుతో జిల్లా వ్యాప్తంగా పాడైపోయిన చెరువుల మరమ్మతు పనులకు 250 కోట్ల రూపాయలతో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా నేటికీ ఆమోదం లభించకపోవడం నిధుల విడుదల చేయకపోవడంతో జిల్లా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది

ఇదీ చదవండి:

CM Review : వ్యాక్సినేషన్‌లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.