ETV Bharat / state

రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుత్తూరులో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం - పుత్తూరులో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. చిత్తూరు జిల్లా పుత్తూరులో కొవిడ్ కేంద్రాన్ని నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ప్రారంభించారు. పుత్తూరు ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. కేకేసీ ఆయుర్వేద కళాశాలలో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

covid care centre
covid care centre
author img

By

Published : May 19, 2021, 4:23 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరులో కొవిడ్ కేంద్రాన్ని నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ప్రారంభించారు. పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సమీపంలోని కేకేసీ ఆయుర్వేద కళాశాలలో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరి నియోజకవర్గంలోని ప్రజలు.. కరోనా చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళుతూ ఆక్సిజన్ బెడ్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా.. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు సెల్వమణి తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్​లో.. 150మంది వరకు చికిత్స పొందవచ్చని, ఆక్సిజన్ బెడ్లు కూడా అందుబాటులో ఉంటాయని
ఆయన వివరించారు. అనంతరం వడమాలపేట, విజయపురం, నిండ్ర మండల ప్రభుత్వ ఆస్పత్రులకు.. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ నియంత్రణ వైద్య చికిత్సకోసం ఆక్సీమీటర్లు, శానిటేషన్ పరికరాలను అందచేశారు.

ఇదీ చదవండి: రుయాలో మరణాలపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.